చిన్న మస్తాన్ కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నేతలు
శ్రీ సిటీ అక్టోబర్ 4 గరుడధాత్రి : శ్రీసిటీ టీఐఎల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో జరిగిన బాయిలర్ పేలుడు ఘటనలో మృతి చెందిన సత్యవేడు మండలం చెరివి గ్రామానికి చెందిన చిన్న మస్తాన్ కుటుంబాన్ని తిరుపతి జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆదివారం పరామర్శించారు. మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. తిరుపతి జిల్లా కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడు బాలగురువం బాబు, కేకేసీ చైర్మన్ బాలగురువం చిరంజీవి, సూళ్లూరుపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి డి.కిరణ్ కుమార్ చిన్న మస్తాన్ మృతదేహాన్ని సందర్శించారు. వారి వెంట కేకేసీ...