చివరి క్షణం వరకు పోరాడిన ఎస్‌ఐ సునీల్ – విషాదాంతమైన రక్షణ ప్రయత్నం

నాగలాపురం రెవిన్యూ పరిధిలోని ఈశంగాడు పరిసర ప్రాంతంలో జరిగిన హృదయ విదారక ఘటన ప్రతి ఒక్కరినీ కలచివేసింది. బావిలో పడిపోయిన చిన్నారులను ప్రాణాలతో రక్షించేందుకు ఎస్‌ఐ సునీల్ చివరి క్షణం వరకు ప్రాణాలకు తెగించి పోరాడారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఆయన, పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా వెనుకడుగు వేయకుండా సహాయక చర్యలను వేగవంతం చేశారు. బావిలో చిక్కుకున్న చిన్నారులను బయటకు తీసేందుకు తన శక్తి మేర ప్రయత్నిస్తూ, వారిని కాపాడాలని అహర్నిశలు కృషి చేశారు. అయితే, అన్ని ప్రయత్నాలు...