చెట్లు నాటడం విద్యార్థులు అలవాటు చేసుకోవాలి

వసనాడులో గంగమ్మ ఆలయాన్ని సందర్శించి భువనేశ్వరి పూజలు వసనాడు జడ్పీ స్కూల్లో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన భువనేశ్వరి కుప్పం,జూలై 29(గరుడ ధాత్రి న్యూస్):చెట్లు నాటడం విద్యార్థులు అలవాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి,ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. బుధవారం వసనాడు గ్రామంలో జడ్పీ పాఠశాలలో మొక్కలు నాటి అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ఇవాళ నాటిన చెట్టు రేపు వృక్షమై పదిమందికి నీడనిస్తుందన్నారు.గురువులను గౌరవించాలని,వారిని హేళన చేయకూడదన్నారు.తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారనే విషయాన్ని పిల్లలు మర్చిపోకూడదన్నారు. నా...