చెత్తాచెదారాలతో నిండిన యూనియన్ బ్యాంక్ ఏటీఎం కేంద్రం
-ఏసీ లేక దుమ్ముతో మూలుగుతున్న యంత్రాలు.. ఖాతాదారుల ఆవేదన నాగలాపురం, జూన్ 3 గరుడధాత్రి : నాగలాపురంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం కేంద్రం అవ్యవస్థలకు నిలయంగా మారిందని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటీఎం కేంద్రం పరిసరాలు చెత్తాచెదారాలతో నిండిపోవడంతో నగదు లావాదేవీల కోసం వచ్చే వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రతిరోజూ వందలాది మంది ఖాతాదారులు ఉపయోగించే ఈ ఏటీఎం కేంద్రంలో కనీస పరిశుభ్రత ప్రమాణాలు కూడా పాటించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. కేంద్రం చుట్టూ పేరుకుపోయిన చెత్త కారణంగా...