చౌడేపల్లి అక్టోబర్ 08 గరుడ దాత్రి న్యూస్
మండల పరిధిలోని దుర్గసముద్రం, పెద్దయల్లకుంట్ల గ్రామ పంచాయతీలలో ఉన్న ‘చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలను’ చౌడేపల్లి మండల డిప్యూటీ ఎంపీడీఓ గఫుర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ తనిఖీలో భాగంగా కేంద్రాల్లో వర్మీ కంపోస్ట్ (వానపాముల ఎరువు) తయారీ విధానంపై క్లాప్ మిత్రులకు ఆయన పలు సూచనలు, సలహాలు అందించారు. అనంతరం స్వయంగా వర్మీ తొట్టెలలో వానపాములను విడుదల చేశారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణతో పాటు తడి చెత్త ద్వారా ప్రకృతి ఎరువులను తయారు చేసి పంచాయతీలకు ఆదాయం సమకూర్చుకోవాలని ఈ సందర్భంగా డిప్యూటీ ఎంపీడీఓ సూచించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శులు సుభాషిణి, లోకేష్ కుమార్ మరియు పారిశుధ్య సిబ్బంది, క్లాప్ మిత్రలు పాల్గొన్నారు.