GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 5:23 pm Digital Edition : GURU SWAMY

చెన్నె శంకర్ నేత్రాలయ మరియు మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలోకొనసాగిన ఉచిత కంటి చికిత్స శిభిరం

బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్13

బైరెడ్డిపల్లి జడ్ పి హైస్కూల్ నందు ఆదివారం చెన్నె శంకర్ నేత్రాలయ మరియు మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి చికిత్స శిభిరం నిర్వహించారు.ఈ చికిత్సా శిభిరం నకు మండలం లోని ప్రజలు 32మంది కి వైద్య పరీక్షలు చేపట్టగా.కంటి శస్ర్త చికిత్స నకు 17మంది ఎంపికయినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.ఇంతకు మునుపు కంటిశస్త్ర చికిత్స చేసుకొన్నవారికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ రోజు కంటి శస్త్ర చికిత్సలకు ఎంపికయిన వారికి ప్రఖ్యాతి గాంచిన చెన్నె శంకర నేత్రాలయ హాస్పిటల్ నందుఉచిత కంటి శస్త్త చికిత్సలు చేయడం జరుగుతుందిఅని వీరందరికి ఉచిత ప్రయాణం ,బోజనం,వసతి,మందులు అందజేయడం జరుగుతుంది అని తెలిపారు.శస్ర్ర చికిత్స లకు ఎంపికైన వారికి వారి సహాయకులకు ఈ రోజు మధ్యాహ్న భోజనం ,తాగునీరు శ్రీనివాస హోటల్ దిలీప్ కుటింబీకులు ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమం లో శంకర నేత్రాలయడా,మురళి క్రిష్ణ,డా,శ్రీనివాసులు,డా.రమణ,డా,గంగాధరం చంద్ర,చిన్నప్ప ,జయరామి రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.