చెరువును కొల్లగొడుతున్న గ్రావెల్ మాఫియా..?
చెరువును కొల్లగొడుతున్న గ్రావెల్ మాఫియా..? -గరుడాద్రి చెరువుపై అక్రమ తవ్వకాల ముప్పు -“ఇప్పటికైనా అధికారులు మేల్కొవాలి” -బత్తలవల్లం గ్రామస్థుల ఆవేదన గరుడధాత్రి న్యూస్ : ప్రజలకు జీవనాధారంగా నిలవాల్సిన చెరువులు… ఇప్పుడు అక్రమ గ్రావెల్ దందాలకు కేంద్రాలుగా మారుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం బత్తలవల్లం గ్రామంలోని గరుడాద్రి చెరువు ప్రస్తుతం అక్రమ గ్రావెల్ తవ్వకాలతో ప్రమాద అంచున నిలిచిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రజల కథనం ప్రకారం, కొంతకాలంగా చెరువు పరిసరాల్లో రాత్రింబవళ్లు భారీ వాహనాలతో గ్రావెల్...