GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 8:11 am Digital Edition : GURU SWAMY

చౌడేపల్లిలో ఘనంగా ఎస్ టి యు సభ్యత్వ నమోదు 30శాతం ఐ ఆర్ ప్రకటించాలని డిమాండ్


చౌడేపల్లి ఆగస్టు 05 గరుడ దాత్రి న్యూస్

చౌడేపల్లి మండలంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు ఉపాధ్యాయుల సమస్యల సేకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభ్యత్వం స్వీకరించారు.
​ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన ఎస్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల మధుసూదన్, రాష్ట్ర కార్యదర్శి మోహన్ యాదవ్ మాట్లాడుతూ.. 12వ పిఆర్‌సి అమలులో దాదాపు మూడేళ్ల ఆలస్యం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగ, ఉపాధ్యాయులకు 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
​అనంతరం జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీ లింగమూర్తి మాట్లాడుతూ.. జిల్లాల పునర్విభజన వల్ల ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం ముందుగా పరిష్కరించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి సంఘం ఎల్లప్పుడూ ముందుంటుందని భరోసా ఇచ్చారు.
​ఈ కార్యక్రమంలో మండల గౌరవ అధ్యక్షులు ఏవి సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, జిల్లా నాయకులు మురళీమోహన్, ఆంజనేయులు, సుబ్రహ్మణ్యం మరియు స్థానిక ఉపాధ్యాయులు భారీగా పాల్గొన్నారు