GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 6:45 am Digital Edition : GURU SWAMY

​చౌడేపల్లిలో విఆర్ఏల సహాయ నిరాకరణ ఉద్యమం: డిమాండ్ల పరిష్కారానికి నిరసన దీక్ష

​
చౌడేపల్లి సెప్టెంబర్ 28 గరుడ దాత్రి న్యూస్

ఎపి విఆర్ఏ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చౌడేపల్లి మండలంలో విఆర్ఏలు తమ సమస్యల పరిష్కారం కోసం సోమవారం నిరసన బాట పట్టారు. సెప్టెంబర్ 16 నుంచి “సహాయ నిరాకరణ ఉద్యమం” చేపడుతూ, స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద దీక్ష కార్యక్రమం నిర్వహించారు.
​సమగ్ర న్యాయం జరగాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ ఉద్యమంలో భాగంగా విఆర్ఏలు ప్రభుత్వానికి తమ ప్రధాన డిమాండ్లను స్పష్టం చేశారు. ​విఆర్ఏలకు వేతన స్కేల్‌ను తక్షణమే అమలు చేయాలనీ
​విఆర్ఏల స్థానంలో నామినీలను విఆర్ఏలుగా నియమించాలన్నారు
​అర్హులైన విఆర్ఏలకు తగిన ప్రమోషన్లు అందించాలన్నారు
​ కారుణ్య నియామకాల ప్రక్రియను నిబంధనల ప్రకారం చేపట్టాలన్నారు
​తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలన్నారు లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సంఘ ప్రతినిధులు సుమంత్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి రాజన్న రెడ్డిప్ప భాస్కర్ సావిత్రమ్మ రెడ్డిరాజా గంగులప్ప పలువురు విఆర్ఏలు నాయకులు పాల్గొని నినాదాలు చేశారు.