GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 5:45 am Digital Edition : GURU SWAMY

చౌడేపల్లిలో విషాదం రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

చౌడేపల్లి సెప్టెంబర్ 19 గరుడ దాత్రి న్యూస్

చౌడేపల్లిలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది రెండు స్కూటర్లు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు చౌడేపల్లి పలమనేరు ప్రధాన రహదారిలో చిట్టి రెడ్డి పల్లి వద్ద ఇరుమార్గాల నుంచి వస్తున్న రెండు స్కూటర్లు ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో చౌడేపల్లి పట్టణం కుమ్మర వీధికి చెందిన మహేష్ 26 చౌడేపల్లి పరిధిలోని గోసల కురపల్లికి చెందిన సంతోష్ 22 అక్కడికక్కడే మృతి చెందారు అదే విధంగా చౌడేపల్లి ఇండియన్ బ్యాంక్ మేనేజర్ నరేంద్ర గోశాల కొరపల్లికి చెందిన చంద్రశేఖర్ లకు తీవ్ర గాయాలయ్యాయి గాయపడ్డ వారిని మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు విషయం తెలిసిన వెంటనే పుంగనూరు రూరల్ సీఐ సాయి ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకున్నారు ట్రాఫిక్ ను మళ్లించి ఇద్దరి మృతి దేహాలను పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి సేవ పరీక్ష నిమిత్తం తరలించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు కాగా మహేష్ ఇండియన్ బ్యాంకులో స్కావెంజర్ గా పని చేస్తున్నాడు అందరిలో మంచి పేరు ఉండడంతో ఒక్కసారిగా చౌడేపల్లి శోకసముద్రంలో మునిగిపోయింది అదేవిధంగా కూలి పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్న సంతోష్ మృతి ఆ కుటుంబానికి తీరని లోటు అయింది బ్యాంకు మేనేజర్ నరేంద్రకు కుడికన్ను తీవ్ర గాయం కావడం అదేవిధంగా తలపై బలమైన గాయం కావడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు మహేష్ కు వివాహం జరిగి ఆరు నెలలు అయింది ప్రస్తుతం మృతుని భార్య నాలుగు నెలల గర్భవతి ఇరు కుటుంబాలలోను సంపాదకులు మృతి చెందడంతో ఆయా కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి