చౌడేపల్లిలో వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు

చౌడేపల్లి సెప్టెంబర్ 04 గరుడ దాత్రి న్యూస్ చౌడేపల్లి మండలంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని భక్తులు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మండలవ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, ఆలయాలన్నీ కృష్ణుడి నామస్మరణతో మారుమోగాయి. చౌడేపల్లి పట్టణంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో వేడుకలు కోలాహలంగా సాగాయి. ఆలయ ప్రధాన అర్చకుడు వశిష్టాచార్యులు ఆధ్వర్యంలోఉదయాన్నే స్వామివార్లకు శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించి, కన్నులపండువగా విశేష అలంకరణ చేశారు. ఉదయం నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. సాయంత్రం...