చౌడేపల్లి ఆరోగ్య కేంద్రంలో లో మాతా శిశు ఆరోగ్యంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం

చౌడేపల్లి, ఆగస్టు 07 గరుడ దాత్రి న్యూస్ గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ కాతి కావ్య ఆధ్వర్యంలో ప్రత్యేక ఆరోగ్య శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజ శ్రేయస్సులో భాగస్వాములైన ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, ఏఎన్‌ఎంలు, సిహెచ్‌ఓలు, స్టాఫ్ నర్సులు మరియు స్థానిక ప్రజలకు వివిధ ఆరోగ్య అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు. ముఖ్యంగా మాతా శిశు సంరక్షణ, సరైన పోషకాహారం, రోగనిరోధకత, మహిళా శారీరక ఆరోగ్యం ఇన్ఫెక్షన్ల...