చౌడేపల్లి అక్టోబర్ 02 గరుడ దాత్రి న్యూస్
చౌడేపల్లి మండలం పుదిపట్ల గ్రామంలో స్వయంభూగా వెలసిన శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు కన్నులపండువగా సాగాయి. ఉదయాన్నే ఆలయ అర్చకురాలు శ్రావణి అమ్మవారికి పంచామృత అభిషేకంతో పాటు ప్రత్యేక అలంకరణలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
ఈ పూజా కార్యక్రమంలో చౌడేపల్లి, పుంగనూరుతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. శుక్రవారం నాటి పూజలకు తాడేపల్లి బాలకృష్ణ, రాధ దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. అనంతరం ఆలయ ధర్మకర్త వినోద్ కుమార్ భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.