జగనన్న కాలనీలో పోలీసులచే పల్లెనిద్ర
కార్వేటినగరం అక్టోబర్ 2 (గరుడదాద్రి న్యూస్): కార్వేటినగరం పంచాయతీ పద్మ సరస్సు సమీపంలో ఉన్న జగనన్న కాలనీలో పోలీసులచే పల్లెనిద్ర కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి సీఐ హనుమంతప్ప ఎస్సై తేజస్విని ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న కాలనీలో ఏదైనా సంఘటన జరిగితే తమకు సమాచారాన్ని ఇచ్చారన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు కాలనీలో సంచరిస్తూ ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కాలనీలో నివసిస్తున్న వారు మత్తు పదార్థాలకు బానిస కాకూడదన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు కాలనీవాసులు పాల్గొన్నారు.