-రెండేళ్లలో విధ్వంసం నుంచి విజయోత్సవం వైపుగా రాష్ట్రం పయనం
-రెండేళ్ల నమ్మకం – ప్రజల విశ్వాసం….రెండేళ్ల అభివృద్ధి – రాష్ట్ర ప్రగతి
-రెండేళ్ల సంక్షేమం – ప్రతి కుటుంబానికి భరోసా
-ఎమ్మెల్యే అమర్ అధ్యక్షతన కూటమి ఆధ్వర్యంలో జరిగిన విజయోత్సవ సభ
-భారీగా తరలివచ్చిన కూటమి నాయకులు
-పలమనేరు నియోజకవర్గంలో సూపర్ సక్సెస్
పలమనేరు, జూన్ 16 గరుడ ధాత్రి :
ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి కాక్రోచ్ అయితే కూటమి హిట్ కొట్టి పడుకోబెడతామని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి సూచించారు. పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద కూటమి రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం పేరిట మంగళవారం విజయోత్సవ సభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కూటమి నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ….. 2024 లో కూటమి ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు రెండూ సమపాళ్లలో చేయడమే కాకుండా… గత ఐదేళ్లలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం నుంచి బయటపడేసిన ఘనత ఈ ప్రభుత్వానిదన్నారు. గత ఐదేళ్లలో భయాందోళనలకు గురైనటువంటి రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చి, పెట్టుబడిదారులను పరిశ్రమలను గతంలో భయపెట్టి పారద్రోలినటువంటి సందర్భం నుంచి… మళ్లీ ఈ రాష్ట్రానికి ఒక నమ్మకాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గత ఐదేళ్లలో ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి వాతావరణాన్ని మనందరం చూశామని ప్రజాస్వామ్యం ఎక్కడా కనిపించలేదన్నారు.
ఏదైతే గతంలో కూటమి చెప్పిన మాట ప్రకారం “సూపర్ సిక్స్” పథకాలు మేము అందిస్తామని చెప్పామో, ఆ సూపర్ సిక్స్ పథకాలను సూటిగా అందజేసిన ఘనత తమదే అని అన్నారు. ఇక అభివృద్ధి కార్యక్రమాల పరంగా చూస్తే… ఈరోజు అమరావతి గాని, పోలవరం గాని, ఈరోజు రాష్ట్రానికి వచ్చేటటువంటి పెట్టుబడులు గాని, గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు గాని, నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాటికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు గాని, ఈరోజు సాగునీటికి సంబంధించి మన కళ్లముందే కనపడేటటువంటి హంద్రీ-నీవా లాంటి ప్రాజెక్టులు గాని, అన్నీ కూడా ఈ రెండేళ్లలో ప్రధానంగా ఒక దారికి తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని గుర్తుచేసుకోవాలన్నారు.
అదే కాకుండా ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి రెండూ కూడా సమపాళ్లలో ఈ ప్రభుత్వం చేపడుతున్న విషయాన్నీ కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. రెండేళ్ల తర్వాత ప్రతిపక్ష పార్టీలు రోడ్ల పైకి వచ్చి, వాళ్లు గతంలో చేసినటువంటి విధ్వంసాన్ని మరిచి, సోషల్ మీడియాలో ఈరోజు ఏదో అన్యాయం జరిగిపోతా ఉంది, ఈరోజు ఏదో మోసం జరిగిపోతోంది అంటూ చేస్తున్న దుష్ప్రచారం తిప్పికొట్టాలని పిలిపునిచ్చారు.
ఈరోజు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, వ్యాపారస్తులు గాని, రైతులు గాని, సామాన్య ప్రజానీకం గాని ధైర్యంగా వాళ్ల కార్యక్రమాలు వాళ్లు చేసుకునేటువంటి అవకాశం ఈ ప్రభుత్వంలో ఉందన్నారు. ఈరోజు “నా భూమి.. నా చేతుల్లోనే” ఉందని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఎవరి ఆస్తులు కూడా వాళ్ల చేతుల్లో లేవని వివరించారు. నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏదో రోడ్లపైకి వచ్చేస్తే సామాన్య ప్రజలు ఎవ్వరూ నమ్మేటువంటి పరిస్థితి లేదన్నారు . మనం చేసినటువంటి కార్యక్రమాలు మనం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం, ఆ బాధ్యత మనపై ఉంది కాబట్టి.. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మనం ఏం చేస్తున్నామో, ఏం చేయబోతా ఉన్నామో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దామని ఆయన పిలుపునిచ్చారు. ఇక నియోజకవర్గానికి సంబంధించి దాదాపు గత ప్రభుత్వంలో ఆపేసిన పనులన్నీ.. దాదాపు ఈఏపీ కింద 134 కోట్ల రూపాయల పనులు ఆపేస్తే, ఆ పనులన్నీ కూడా ఈ మధ్యనే ఒక నెల క్రితమే 100% టెండర్లు వేసి, ఆ పనులన్నీ కూడా కంప్లీట్ చేశామన్నారు. ఈ రెండు సంవత్సరాలలో
అదే విధంగా ప్రభుత్వం నుంచి మనకు ఏదైతే ఎన్ ఆర్ ఈ జి ఎస్ కింద గ్రామాల్లో మొత్తం కూడా రోడ్లు కంప్లీట్ చేశామని, గత ప్రభుత్వంలో ఆపేసినటువంటి ఆ పనులన్నిటికీ కూడా కంప్లీట్ చేసే కార్యక్రమం చేశామన్నారు.
హంద్రీ-నీవా ద్వారా నీళ్లు ప్రతి చెరువుకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టామని రాబోయే కాలంలో 100% దాన్ని కూడా కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకోబోతా ఉన్నామని కార్యకర్తలకు భరోసా నింపారు.
ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి అంచెలంచెలుగా కూడా అన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పూర్తి చేసుకుందామన్నారు. ఈ విజయోత్సవ సభలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, మాజీ చైర్మన్ రామచంద్ర నాయుడు, మాజీ ఎంపీపీ విజయ్ భాస్కర్ రెడ్డి, బాలాజీ కోపరేటివ్ బజార్ అధ్యక్షులు ఆర్వి బాలాజీ, రాష్ట్ర వేర్హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ రంగనాథ్, రాష్ట్ర కృప కార్పొరేషన్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం గౌడ్, రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ గజేంద్ర, కూటమి నాయకులు దిలీప్ కుమార్,ప్రభాకర్, శరవణ, ఖాజాపీర్, మంజులమ్మ, సుబ్రహ్మణ్యం రెడ్డి, బత్తి గౌడు, విశ్వనాథ్,పర్వీన్ మరియు అన్ని మండల పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, సింగిల్ విండో చైర్మన్లు మరియు డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు