పలమనేరు, ఆగస్టు 02 ( గరుడ ధాత్రి ) :
క్రిష్ణమ్మ గారి జీవన ధార ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం పలమనేరు రూరల్ మండలంలోని జగమర్ల ఎరుకల కాలనీలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ శిబిరానికి ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణులు డాక్టర్ నాగరాజు మరియు తుంబకుప్పం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వై. ఎన్. సెల్వరాజు హాజరై రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. 90 మందికి షుగర్ మరియు బిపి (రక్తపోటు) పరీక్షలు నిర్వహించి తగిన వైద్య సలహాలు అందించారు.115 మందికి వివిధ రకాల వ్యాధులకు సంబంధించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్రిష్ణమ్మ గారి జీవన ధార ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు క్రిష్ణమ్మ గారి జనార్ధన్ మాట్లాడుతూ… గ్రామీణ, గిరిజన మరియు వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ సంస్థ ముఖ్య ఉద్దేశమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు ఎంటిఆర్ ప్రసాద్, నాగేంద్ర, కిరణ్, సుబ్రహ్మణ్యం, రమణలతో పాటు ఫార్మసిస్ట్ నిరూపమ, సలోమి, మంజుల తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.