GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 02 July 2026, 3:43 pm Digital Edition : GURU SWAMY

జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీకి దరఖాస్తు అందజేత

పిచ్చాటూరు, జూలై 2 గరుడధాత్రి :
తిరుపతి పార్లమెంట్ పరిధిలో ప్రారంభమైన జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కార్యక్రమంలో భాగంగా, ఉమ్మడి చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండల జనసేన నాయకులు ఎన్. సుగంధర్, సి. రాజశేఖర్ గురువారం కమిటీ సభ్యురాలు శ్రీమతి లోకం నాగ మాధవికి తమ దరఖాస్తును అందజేశారు.
ఈ సందర్భంగా పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో తాము చేసిన సేవలు, ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ జనసేన పార్టీ జెండాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిరంతరం చేసిన కృషి, పార్టీ సిద్ధాంతాల పట్ల తమ అంకితభావాన్ని శ్రీమతి లోకం నాగ మాధవి దృష్టికి తీసుకెళ్లారు.
పార్టీ అభివృద్ధి, సంస్థాగత బలోపేతం కోసం భవిష్యత్తులో కూడా అదే నిబద్ధతతో పనిచేస్తామని వారు ఈ సందర్భంగా తెలిపారు.