GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 7:43 pm Digital Edition : GURU SWAMY

జయతీర్థుల ఆరాధనలో పాల్గొన్న బైరెడ్డిపల్లి మండల బ్రాహ్మణ సోదరులు

బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు4

మధ్వాచార్యులు ప్రబోధించిన ద్వైత సిద్ధాంతాన్ని ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా న్యాయసుధ, బ్రహ్మసూత్ర గ్రంథాల ద్వారా తీసుకువెళ్లిన గురువు, కర్ణాటక *మలకేడ్ *లో వెలసిన శ్రీ జయతీర్థుల ఆరాధన సందర్భంగా ముళభాగల్ శ్రీ శ్రీపాద రాజమఠం లో ఘనంగా నిర్వహించారు. మఠాధిపతులు శ్రీశ్రీశ్రీ సుజయ నిధి స్వామివారు ఉత్సవ విగ్రహాలకు సంస్థాన పూజలు నిర్వహించారు.అర్చకులు మంజునాథ్ మూల బృందావనానికి నిర్మాల్యపూజ, పంచామృత అభిషేకములు చేసి సుగంధ పుష్పాలతో సుందరంగా అలంకరించి పూజలు చేశారు. శ్రీ జయతీర్థుల చిత్రపటాన్ని ప్రాకారోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో బైరెడ్డిపల్లి మండలం బ్రాహ్మణ సోదరులతో పాటు కర్ణాటక, ఆంధ్ర నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీపాదరాజ మఠం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు.