GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 6:35 pm Digital Edition : GURU SWAMY

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి..!

-మంత్రి పార్థసారథికి వినతిపత్రం అందజేసిన ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్ సభ్యులు

ప్రొద్దుటూరు, జూన్ 13: ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథిని దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు.
శనివారం ప్రొద్దుటూరు పర్యటనకు విచ్చేసిన మంత్రికి ఆర్&బి అతిథి గృహంలో.. జర్నలిస్టులు వారి సమస్యలకు సంబంధించిన వినతిపత్రాన్ని అందజేశారు. జర్నలిస్టులకు సామాజిక భద్రత కల్పించడంతో పాటు అర్హులైన పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రెస్ క్లబ్ ప్రతినిధులు కోరారు. వినతిపత్రాన్ని స్వీకరించిన మంత్రి, జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.