జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి..!
-మంత్రి పార్థసారథికి వినతిపత్రం అందజేసిన ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్ సభ్యులు ప్రొద్దుటూరు, జూన్ 13: ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథిని దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. శనివారం ప్రొద్దుటూరు పర్యటనకు విచ్చేసిన మంత్రికి ఆర్&బి అతిథి గృహంలో.. జర్నలిస్టులు వారి సమస్యలకు సంబంధించిన వినతిపత్రాన్ని అందజేశారు. జర్నలిస్టులకు సామాజిక భద్రత కల్పించడంతో పాటు అర్హులైన పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రెస్ క్లబ్ ప్రతినిధులు కోరారు. వినతిపత్రాన్ని స్వీకరించిన మంత్రి,...