GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 01 May 2026, 5:58 am Digital Edition : GURU SWAMY

జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటాం

జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటాం

పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి

వి కోట గరుడ దాత్రి న్యూస్ ఏప్రిల్ 30

వి కోట పట్టణం నందు మార్నింగ్ వాక్ వెళ్తున్న ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిని రౌడీషీటర్ తమిమ్ అత్యంత దారుణంగా హత్య చేయడంతో పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతికి విఘాతం కల్పించే చర్యలను ప్రభుత్వం సహించదని, ప్రశాంతంగా ఉండే వీకోటలో పట్టపగలు ఇలాంటి అమానుష చర్య జరగడం అత్యంత దురదృష్టకరమని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఇటువంటి హింసాత్మక ఘటనలు సమాజానికి పెనుముప్పు అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ముఖ్యమంత్రిని, హోం మంత్రిని కోరానని వారు సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. తప్పకుండా బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందని,నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చట్టపరంగా వారికి కఠిన శిక్షలు పడే విధంగా చూడాలని అధికారులును ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. మీ కుటుంబానికి నేను ఎప్పుడు అండగా ఉంటానని, ఏ అవసరం వచ్చినా నన్ను సంప్రదించవచ్చునని హామీ ఇచ్చారు. చెడు పురుగులను సమాజం నుండి ఏరి వేయకపోతే శాంతి భద్రతకు విగాథం కలుగుతుందని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్య తీసుకుంటుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం చట్టపరంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఎమ్మెల్యే వెంట రామచంద్ర నాయుడు, రంగనాథ్, రాంబాబు, ధీరజ్, నారాయణస్వామి, హరినాథ్ రెడ్డి, లక్ష్మణ్, డీఎస్పీ ప్రభాకర్ తదితరులు ఉన్నారు.