జలధార–జలహారతితో నీటి సంరక్షణకు కొత్త ఊపు

జలధార–జలహారతితో నీటి సంరక్షణకు కొత్త ఊపు గరుడధాత్రి న్యూస్ : తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలో జలధార–జలహారతి కార్యక్రమం ద్వారా వర్షపు నీటిని సంరక్షిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి వనరులను అభివృద్ధి చేసే పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రూ.1.57 కోట్ల అంచనా వ్యయంతో మండలంలో మొత్తం 68 నీటి సంరక్షణ పనులకు పరిపాలనా అనుమతులు జారీ అయ్యాయి. ఈ పనుల ద్వారా మండలంలోని వేలాది ఎకరాలకు సాగునీటి లబ్ధి కలగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా 26 ఫీడర్ కాలువల పునరుద్ధరణ, 20 ఫీల్డ్ కాలువల...