జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

-అఖిల భారత రైతు కూలీ సంఘం పిలుపు పిచ్చాటూరు, సెప్టెంబర్ 21 గరుడధాత్రి న్యూస్ : ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఖమ్మం జిల్లాలో నిర్వహించనున్న అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం పిచ్చాటూరు మండల కార్యదర్శి జి. దక్షిణామూర్తి పిలుపునిచ్చారు. మహాసభల విజయవంతానికి పిచ్చాటూరు మండల కేంద్రంలో సంఘం ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దక్షిణామూర్తి మాట్లాడుతూ జాతీయ మహాసభల విజయవంతానికి ప్రజలు సహకరించాలని కోరారు....