జాతీయ లోక్ అదాలత్ నందు 510 కేసులు పరిష్కారం
!)సీనియర్ సివిల్ న్యాయమూర్తి వావిలి ఆదినారాయణ. పలమనేరు, సెప్టెంబర్ 12 ( గరుడ ధాత్రి ) : దేశవ్యాప్తంగా జరుగుతున్న జాతీయ లోక్ ఆదాలత్ అన్నది కక్షిదారులకు మంచి సువర్ణ అవకాశమని సీనియర్ సివిల్ జడ్జి వావిలి ఆదినారాయణ అన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్ ద్వారా ఇరువర్గాల కక్షిదారులు రాజీమార్గంలో కేసులను పరిష్కరించుకోవడానికి సుప్రీంకోర్టు నిర్ణయించిందన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్ నందు ఇద్దరు పార్టీలు సమానంగా గెలుపొందినట్లుగా అవార్డును పొందవచ్చన్నారు. ఈ యొక్క అవార్డు కాపీలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తో సమానమని...