జానపద కళలతో మార్మోగిన తిరుపతి.. ఘనంగా ప్రపంచ జానపద దినోత్సవ వేడుకలు

తిరుపతి, ఆగస్టు 22 గరుడధాత్రి: పల్లె పరిమళాన్ని, మన సంస్కృతి వైభవాన్ని చాటిచెప్పే జానపద కళలతో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనేట్ హాల్ సందడిగా మారింది. ప్రపంచ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకుని మన సంస్కృతి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి, భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమం జానపద కళాకారులు, సాంస్కృతిక ప్రియులను అలరించింది. మన సంస్కృతి వ్యవస్థాపకులు రెడ్డప్ప ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎస్వీ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్ ప్రొఫెసర్...