జాపాలి హనుమాన్ కు టీటీడీ పట్టు వస్త్రాలు సమర్పణ
జాపాలి హనుమాన్ కు టీటీడీ పట్టు వస్త్రాలు సమర్పణ హనుమజ్జయంతి సందర్భంగా తిరుమలలోని జాపాలి శ్రీ ఆంజనేయ స్వామి వారికి టీటీడీ తరపున ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి మంగళవారం ఉదయం పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ఈవో, అదనపు ఈవోలకు అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు సింధూర వస్త్రంతో ఈవో, అదనపు ఈవోలను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు....