జిల్లా,డివిజన్,మండల స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

ఈ నెల 4 వ తేదీ సోమవారం జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండల స్థాయిలో తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో ఆర్డీవో కార్యాలయాల్లో పి జీ ఆర్ ఎస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మండల కార్యాలయంలో తహశీల్దారులు, ఎంపీడీవోలు, ఇతర మండల అధికారులు, ఆర్డీవో కార్యాలయాల్లో రెవిన్యూ డివిజనల్ అధికారి, ఇతర డివిజనల్ అధికారులు పాల్గొని వినితలను...