జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా బి. చెంగల్ రాజు ఎంపిక
కార్వేటి నగర సెప్టెంబర్ 4 (గరుడ దాద్రి న్యూస్): విద్యా రంగంలో సుదీర్ఘకాలంగా విశిష్ట సేవలందిస్తూ, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల విద్యా ప్రగతికి, పాఠశాల మౌలిక వసతుల కల్పనకు విశేష కృషి చేస్తున్న పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కత్తెరపల్లె ప్రధానోపాధ్యాయుడు శ్రీ బి. చెంగల్ రాజు గారు ఈ సంవత్సరం ప్రకటించిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. సుమారు 31 సంవత్సరాలుగా విద్యా శాఖలో వివిధ హోదాల్లో సేవలందించిన చెంగల్ రాజు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా, స్కూల్...