జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు రామయ్యకు ఘన సన్మానం
పలమనేరు, సెప్టెంబర్ 27 గరుడధాత్రి : పలమనేరు లయన్స్ క్లబ్లో ఆదివారం ఉచిత కంటి చికిత్సా శిబిరం విజయవంతంగా జరిగింది. క్లబ్ చైర్మన్ గుణశేఖరన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరానికి మహతి ఫౌండేషన్ చైర్మన్ లయన్ నాగరాజు అన్ని వసతులు కల్పించారు. వైద్య శిబిరం అనంతరం కల్లుపల్లి హైస్కూల్‌లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చందనం రామయ్యను లయన్స్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించడంతో పాటు, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న రామయ్య సేవలకు గాను ఇటీవలే ఆయన...