GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 30 April 2026, 7:47 pm Digital Edition : GURU SWAMY

జిల్లా స్థాయిలో 1 మరియు 3వ ర్యాంకులు కైవసం…!

*పదవ తరగతి ఫలితాల్లో వరదయ్యపాలెం విద్యార్థుల ప్రభంజనం…జిల్లా స్థాయిలో 1 మరియు 3వ ర్యాంకులు కైవసం…!*

నేడు విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో తిరుపతి జిల్లా, వరదయ్యపాలెం మండలం విద్యార్థులు అసాధారణ ప్రతిభ కనబరిచి సత్తా చాటారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధించి జిల్లా స్థాయిలోనే అగ్రస్థానంలో నిలిచారు.

వరదయ్యపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ఈ ఏడాది ఫలితాల్లో రికార్డు సృష్టించారు…

S.దీషిత సాయి D/O జగన్నాధం,నిర్మల

జిల్లా స్థాయిలో ఒకటవ (1st) ర్యాంకు, కన్నావరం రేఖ

D/O జయబాబు,లక్ష్మి జిల్లా స్థాయిలో మూడవ (3rd) ర్యాంకు కైవసం చేసుకుని సాధించి మండల కీర్తిని దశదిశలా వ్యాపింపజేశారు.

గ్రామీణ ప్రాంత విద్యార్థులు జిల్లా స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల విజయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం మరియు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.