పలమనేరు, జులై 30 ( గరుడ ధాత్రి ) :
నేషనల్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన విద్యార్థి సి. హేమతేజ్ సాయి చెస్ పోటీలలో విశేష ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఇటీవల నిర్వహించిన మండల స్థాయి పోటీలలో హేమతేజ్ సాయి తన చతురతతో ప్రత్యర్థులను ఓడించి ఈ విజయం సాధించాడు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ సుకుమార్, కరెస్పాండంట్ ప్రమోద్ కుమార్, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు పీఈటీ విభాగం విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు. హేమతేజ్ సాయి జిల్లా స్థాయిలో కూడా ఇదే రకమైన ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.