GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 1:06 am Digital Edition : GURU SWAMY

జిల్లా స్థాయి ఫిలాటెలీ ప్రదర్శన

తిరుపతి డివిజన్ సీనియర్ సూపర్డెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో మంగళవారం శిలా టెలి ప్రదర్శన 2026 తిరు పెక్స్ కు సంబంధించిన ప్రాస్పెక్టస్ ను ఫిలాటెలిస్టులు , తపాల శాఖ అధికారులు సమక్షంలో ఘనంగా విడుదల చేశారు ఈ సందర్భంగా తిరుపతి డివిజన్ సీనియర్ సూపర్నెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ ప్రాస్పెక్టస్ జిల్లా స్థాయి ఆవిష్కరించి తిరు ఫెక్స్ నిర్వహణకు సంబంధించిన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఈ ప్రదర్శన సెప్టెంబర్ 2,3 తేదీలలో తిరుపతిలోని గొల్లవానికుంట సమీపంలో ఉన్న ఎస్సార్ ఫంక్షన్ కాన్వెషన్ హాల్లో నిర్వహించబడనట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు ఫిలాఫిస్టులు, స్టాంపులు సేకరణ దారులు ఆహ్వానితులుగా పాల్గొని ఫిలాటెలీ అభివృద్ధి కోసం తపాల శాఖ చేపట్టిన కార్యక్రమాన్ని అభినందించారు సీనియర్ సూపర్నెంట్ ఆప్ పోస్ట్ ఆఫీస్ మాట్లాడుతూ పిలాటెలీ చరిత్ర, సంస్కృతి వారసత్వం అదేవిధంగా జాతీయ సంఘటనలపై అవగాహన పెంపొందించే విలువైన అభిరుచి అని పేర్కొన్నారు సెప్టెంబర్ రెండు మూడు తేదీల్లో నిర్వహించబడుతున్న ఈ ప్రదర్శన ద్వారా ఫిలాపిస్టులు తమ అరుదైన సేకరణలో మంచి వేదిక లభించడంతోపాటు ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు, యువత భారత పౌరుషత్తంపై అవగాహన పెంపొందిస్తుందని ఆశ భావం వ్యక్తం చేశారు ప్రాస్పెక్టస్ విడుదల కార్యక్రమంలోపిలాటెలిస్టులు, ఆహ్వానితులందరికీ తిరుపతి డివిజన్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ మేజర్ సైదా తన్వీర్ కృతజ్ఞతలు తెలియజేస్తూ తిరుఫెక్స్ 2026 విజయవంతమైన నిర్వహణకు అందరూ సహకరించాలని కోరారు