జి.ఎస్.పురంలో అట్టహాసంగా వినాయక నిమజ్జనం

భారీగా తరలివచ్చిన యువత, ప్రజలు పిచ్చాటూరు, సెప్టెంబర్ 20 గరుడధాత్రి న్యూస్: పిచ్చాటూరు మండలం కీలపూడి పంచాయతీ పరిధిలోని జి.ఎస్.పురం గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. వైసీపీ యువ నాయకుడు పాండియన్ ఆధ్వర్యంలో ఆదివారం వినాయకుని నిమజ్జన కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. నిమజ్జన కార్యక్రమంలో గ్రామానికి చెందిన యువకులు, మహిళలు, చిన్నారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డప్పులు, వాయిద్యాల నడుమ గణనాథుడిని ఊరేగింపుగా తీసుకెళ్లి భక్తిశ్రద్ధలతో నిమజ్జనం నిర్వహించారు. యువత ఉత్సాహంగా పాల్గొనడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ...