జి.శంకర్ ప్రజా దర్బార్‌కు విశేష స్పందన
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ బి.కొత్తకోట సెప్టెంబర్ 4:(గరుడ ధాత్రి న్యూస్) ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని,వాటి పరిష్కారానికి కృషి చేయాలనే లక్ష్యంతో శుక్రవారం తంబాలపల్లి తాలూకా పిటిఎం మండల పరిధిలోని వినాయక కళ్యాణ మండపంలో నిర్వహించిన జి.శంకర్ ప్రజా దర్బార్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను జి.శంకర్ దృష్టికి తీసుకెళ్లారు.ప్రజా దర్బార్‌లో ప్రధానంగా రోడ్లు,డ్రైనేజీ, తాగునీరు,విద్యుత్,పింఛన్లు, రేషన్ కార్డులు,ప్రభుత్వ సంక్షేమ పథకాలు,వ్యక్తిగత సమస్యలు తదితర అంశాలపై ప్రజలు...