GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 7:09 am Digital Edition : GURU SWAMY

జి.శంకర్ రాకతో బి.కొత్తకోట షాదీ మహల్‌కు మహర్దశ

ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న భవనానికి మళ్లీ పూర్వ వైభవం స్థానికుల్లో ఆశలు

బి.కొత్తకోట,సెప్టెంబర్4:(గరుడ దాత్రి న్యూస్)
బి కొత్తకోట పట్టణంలో ముస్లిం మైనారిటీలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా నిర్మించిన షాదీ మహల్ ప్రస్తుతం మరోసారి చర్చనీయాంశంగా మారింది.తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా జి. శంకర్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో శుక్రవారం బి కొత్తకోట పిటిఎం రోడ్డులోని స్థానిక షాదీ మహల్ ను సందర్శించడం జరిగింది.గతంలో ఇదే షాదీ మహల్ జి శంకర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే నిర్మాణం జరిగినప్పటికీ అవసరమైన మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో వినియోగానికి నోచుకోలేకపోయింది. దీంతో శుక్రవారం సందర్శించే వెంటనే సాది మహల్లో వంటగదిని మొరుగుదొడ్లను వెంటనే నిర్మించాలని బి కొత్తకోట మున్సిపల్ కమిషనర్ రమాదేవిని ఆదేశించడం జరిగింది. దీంతో వెంటనే మున్సిపల్ కమిషనర్ తమ సిబ్బందిని పంపించి సాది మహల్ ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించే కార్యక్రమం చేపట్టడం జరిగింది.ముఖ్యంగా తాగునీరు, విద్యుత్ వంటి సదుపాయాల కొరతతో షాది మహల్ మారింది.
జి.శంకర్ రాకతో బి.కొత్తకోటలో అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో చర్చ మొదలైంది.ఈ నేపథ్యంలో షాదీ మహల్‌ను కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చి,అవసరమైన మౌలిక వసతులు కల్పించి స్థానికుల వివాహాలు, నిశ్చితార్థాలు,సామాజిక కార్యక్రమాలు,పేద మరియు మధ్యతరగతి కుటుంబాల శుభకార్యాలకు అందుబాటులో ఉండేలా షాదీ మహల్‌ను తీర్చిదిద్దితే ఎంతోమందికి ప్రయోజనం కలుగుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
పేద కుటుంబాలకు ఎంతో ఉపయోగకరం
ప్రైవేటు ఫంక్షన్‌ హాళ్లలో శుభకార్యాలు నిర్వహించడం పేద,మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారంగా మారుతోంది.ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని షాదీ మహల్‌ను అందుబాటులోకి తీసుకువస్తే వారికి కొంత ఊరట లభిస్తుంది.బి.కొత్తకోటలో ఇప్పటికే పలు ప్రైవేటు ఫంక్షన్ హాళ్లు ఉన్నప్పటికీ,ప్రభుత్వ/ప్రజా ప్రయోజనాల కోసం నిర్మించిన ఈ భవనానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.“షాదీ మహల్‌కు మహర్దశ రావాలి”
ఏళ్లుగా తలుపులు తెరుచుకోని షాదీ మహల్‌కు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.జి. శంకర్ ప్రత్యేక చొరవ తీసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి విద్యుత్,తాగునీరు, మరుగుదొడ్లు,పరిసరాల అభివృద్ధి వంటి మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు వెంటనే చేపట్టడం స్థానికుల్లో సంతోషం వ్యక్తం అయింది.“షాదీ మహల్ తలుపులు తెరిస్తే.. పేద కుటుంబాల ఆశలు కూడా తెరుచుకుంటాయి” అనే అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది.