GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 02 July 2026, 8:56 pm Posted by : GURU SWAMY

జూలై నెలలో శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

గరుడధాత్రి న్యూస్ :
తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయం మ‌రియు అనుబంధ ఆల‌యాల‌లో జూలై నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో.
– జూలై 03, 10, 17, 24, 31వ‌ తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చిపై అమ్మ‌వారు ఆల‌య నాలుగు మాడ వీధులలో విహ‌రించి భక్తులకు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. శ్రీ బలరామ కృష్ణ స్వామి వారి ఆలయంలో
– జూలై 12న రోహిణి న‌క్ష‌త్రం సంద‌ర్బంగా శ్రీ కృష్ణ స్వామివారికి సాయంత్రం 6 గంట‌లకు తిరుచ్చి ఉత్సవం జ‌రుగ‌నుంది.
శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో
– జూలై 5 నుండి 7వ తేదీ వ‌ర‌కు శ్రీ సుందరరాజస్వామివారి అవతారోత్సవాలు.
– జూలై 29న ఉత్తర భద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంట‌లకు స్వామివారు తిరుచ్చిపై ఆల‌య నాలుగు మాడ వీధులలో విహరించి అనుగ్ర‌హించ‌నున్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో.
. జూలై 17న దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం సంద‌ర్భంగా సాయంత్రం 5 గంటలకు స్వామివారు తిరుచ్చిపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.
– జూలై 20న హస్త నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5 గంటలకు స్వామివారు తిరుచ్చిపై భక్తులను క‌టాక్షించ‌నున్నారు.
తిరుచానూరు శ్రీనివాస ఆలయం
ఆగస్టు 4, 11, 18, 25వ‌ తేదీలలో వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి మూలవర్లకు అభిషేకం.
అప్ప‌లాయ‌గుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో
జూలై 7న ఉద‌యం 8 గంట‌ల‌కు అష్టదళ పాదపద్మారాధన సేవ.
– జూలై 8న ఉదయం 8 గంటలకు అష్టోత్తరశత కలశాభిషేకం.
– జూలై 17, 24, 31వ తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రలంకారణ సేవ, అభిషేకం.
– జూలై 30వ తేదీ పుష్ప‌యాగం.
– జూలై 5, 12, 19, 26వ‌ తేదీలలో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి ఉదయం 8.15 గంట‌లకు అభిషేకం.