జేబీఆర్ జూనియర్ కళాశాలలో ఘనంగా ‘నవతరంగం’ ఫ్రెషర్స్ డే నిర్వహణ
పిచ్చాటూరు, ఆగస్టు 2 గరుడధాత్రి : తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలంలోని ప్రముఖ విద్యాసంస్థ జేబీఆర్ జూనియర్ కళాశాలలో ఆదివారం “నవతరంగం” ఫ్రెషర్స్ డే కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ పబ్లిక్ స్పీకర్, రచయిత మహేష్ మిరపుల మరియు పిచ్చాటూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులు, తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మహేష్ మిరపుల మాట్లాడుతూ, పిల్లల పెంపకంలో ప్రేమతో పాటు క్రమశిక్షణ కూడా ఎంతో అవసరమని తల్లిదండ్రులకు సూచించారు. జెంటిల్...