జేబీఆర్ విద్యాసంస్థల్లో కృష్ణాష్టమి, ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
శ్రీకృష్ణుడి వేషధారణలో అలరించిన చిన్నారులు.. గురువులకు ఘన సన్మానం పిచ్చాటూరు, సెప్టెంబర్ 5 గరుడధాత్రి : శ్రీకృష్ణుడి బాల్యలీలలు, గురువుల గొప్పతనాన్ని చాటేలా తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలంలోని జేబీఆర్ విద్యాసంస్థల్లో శ్రీకృష్ణాష్టమి, ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొనడంతో విద్యాసంస్థల ప్రాంగణం సందడిగా మారింది. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధా వేషధారణలో అలరించారు. చిన్నారుల నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, శ్రీకృష్ణుడి జీవిత విశేషాలను తెలియజేసే ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి....