-ఇళ్లలు లోకి చేరుకున్న వర్షపు నీరు ఇబ్భంధుల్లో ప్రజలు
-జాతీయ రహదారి ప్రక్కన మోకాలు లోతు నీరు నిలవ
బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్22
బైరెడ్డిపల్లి లో సోమవారం మధ్యాహ్నం నుండి సాయంత్రంవరకు జోరుగా కురిసింది.గ్రామంలో ఒక్కసారిగా వర్షం వల్ల చల్లదనం ఏర్పడి వేడి నుమెడి ఉపశమనం కలిగించింది దీనితో ప్రజలు ఆనందపడ్డారు.కానీ బైరెడ్డిపల్లి బీసీ కాలనీలో ఇరుకైన చిన్న కాలువలు,కాలువల్లో చెత్త చెదారం కురుకొని కలువులు మూతబడింద అన్న సంఘటన చోటు చేసుకున్నది. భారీ వర్షంతో కాలనిలో ఇళ్లలోకి నీరు చేరుకొంది.ఇళ్లల్లోకి నీరు ప్రవేశించిఇల్లు మొత్తం బురదమయం .కాలనీ ఎగువన వైపు ఉన్నజడ్.పి. హైస్కూల్ దగ్గర నుంచి వచ్చే నీరు మొత్తం బీసీ కాలనీలోని ఈ చిన్న కాలువలోకి చేరుతుంది ఫలితంగా ఆ నీరు కాలువలు మునిగి కాలనీ మొత్తం నీటిమయమైంది. చూడటానికి చిన్న నీటి గుంట లాగా కనిపిస్తోంది. అధికారులు దయచేసి ఇకనైనా సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు. కాలనీలోని వరలక్ష్మి మరియు నాగమ్మ మరియు మంగమ్మ మరియు మేస్త్రి భాష వారి ఇంటిలోకి మురుగునీరు ప్రవేశించి ఇల్లు మొత్తం బురద మయమైంది. మరోవైపు చెక్ పోస్ట్ సమీపంలో జాతీయ రహదారి ప్రక్కన మోకాలు లోతు నీరు నిలవడం తో ప్రజలు ఇబ్బందులు ఎదురవ్వడం జరిగింది.గ్రామంలో గతంలో చాలా సంవత్సరాలు క్రితం ఏర్పాటు చేసిన కాలువలు అప్పటి పరిస్థితులు కు అనుగుణంగా నిర్మించారు.దీనివల్ల భారివర్షాలు సమయంలో రహదారులు మర్మత్తులకు గురి కానుంది.కావున అధికారులు ప్రస్తుత పరిస్థితుల కు అనుగుణంగా కాలువలు నూతనంగా ఏర్పాటుచేయాల్సిన పరిస్థితి ఎంతైనా అవసరం అని గ్రామస్థులు కోరుతున్నారు.