జ్ఞాన జ్యోతి సమగ్రాభివృద్ధిపై అంగన్వాడీలకు ప్రత్యేక శిక్షణ
ఐరాల ఆగస్టు 11 (గరుడ ధాత్రి న్యూస్) జ్ఞాన జ్యోతి సమగ్ర అభివృద్ధిపై అంగన్వాడి టీచర్లకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు సిడిపిఓ నిర్మల తెలిపారు. మంగళవారం ఐరాల మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు అంగన్వాడీలకు మూడు రోజులపాటు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమాన్ని ఐరాల ఎం,ఈ,ఓ ,2, భాను ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న అంగన్వాడీలు చెప్పిన విషయాలను నేర్చుకుని ప్రతి పిల్లవాడికి చదవడం రాయడం నేర్పించాలని అన్నారు. గతంలో నేర్చుకున్న విషయాలను నెమర...