స్వచ్ఛమైన తాగునీరు ఎక్కడ..?
పారిశుద్ధ్య చర్యలు అంతంత మాత్రమే
నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాల తొలగింపుపై ప్రశ్నలు
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏవీఎం మునిశేఖర్‌రెడ్డి విమర్శలు
సత్యవేడు సెప్టెంబర్ 19 గరుడధాత్రి :
తిరుపతి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాలు, పారిశుద్ధ్య సమస్యలు, తాగునీటి ఇబ్బందులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏవీఎం మునిశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి ట్యాంకుల శుభ్రత, క్లోరినేషన్ వంటి అంశాల్లో మరింత పర్యవేక్షణ అవసరమని ఆయన పేర్కొన్నారు.
గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి అవసరం
తమకు అందుతున్న సమాచారం ప్రకారం పలు గ్రామాల్లో జ్వరాల సమస్య ఉందని మునిశేఖర్‌రెడ్డి తెలిపారు. తాగునీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడంతో పాటు క్లోరినేషన్, బ్లీచింగ్ పౌడర్ చల్లడం వంటి చర్యలను పకడ్బందీగా చేపట్టాలని కోరారు. గ్రామస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలని అన్నారు.