టిటిడి కళ్యాణోత్సవానికి వేలాదిమంది రాక
కుప్పం, అక్టోబర్ 03 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పం సమీపంలోని బేటరాయ స్వామి కొండ వద్ద శనివారం టిటిడి ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. పెరటాసి నెల మూడవ శనివారం కావడంతో మూడు రాష్ట్రాల నుండి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవ కార్యక్రమంలో పదివేల కు పైబడి భక్తాదులు పాల్గొన్నారు. భక్తాదుల అందరికీ టిటిడి ఆధ్వర్యంలో కంకణాలు పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, టిటిడి పాలక...