టిటిడి కళ్యాణ మండపం పనులు వేగవంతం చేయాలి – ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం
సత్యవేడులో నిర్మాణంలో ఉన్న టిటిడి కళ్యాణ మండపం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించి, పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ విక్రమ్‌కు నాణ్యతతో పాటు వేగం కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం సత్యవేడు గంగ జాతర ఆహ్వానం అందించిన జాతర కమిటీ సభ్యులను ఎమ్మెల్యే తన నివాసంలో కలుసుకున్నారు. జాతర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ రూ.10 వేల నగదు విరాళాన్ని...