టిటిడీ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల మరియు శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలలలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైనట్లు దేవస్థాన విద్యాశాఖ వెల్లడించింది. అర్హత కలిగిన విద్యార్థులు https://admission.tirumala.org వెబ్‌సైట్ ద్వారా తమ దరఖాస్తులను మే 6, 2026 నుంచి జూన్ 3, 2026 వరకు ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. దరఖాస్తులు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే స్వీకరించబడతాయని, కళాశాలలకు హార్డ్ కాపీలు సమర్పించాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం ఆంగ్ల భాషలో...