GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 6:36 am Digital Edition : GURU SWAMY

టిడిపిపార్టీ నూతన భవన నిర్మాణపనులనుపరిశీలించిన ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్

చిత్తూరు సెప్టెంబర్ 23 (గరుడదాత్రిన్యూస్)

చిత్తూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ నూతన భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పార్టీ నాయకులతో కలిసి బుధవారం పరిశీలించాడు మొదటి అంతస్తు స్లాబ్ నిర్మాణంలో భాగంగా కాంక్రీట్ వేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయ భవన నిర్మాణ పనుల పురోగతిని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకి వీడియో కాల్ ద్వారా చూపించి వివరించారు. ఈ సందర్భంగా కార్యాలయ భవనం నిర్మాణ పనులపై గుత్తేదారుకుపలుసూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బీఎన్ రాజసింహులు, టిడిపి జిల్లా అధ్యక్షుడు షణ్ముఖం. ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరి.నగర పార్టీ అధ్యక్షుడు వరుణ్ కుమార్, మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్, నాయకులు అరుణ, మోహన్ రాజ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.