* ఆప్యాయ స్వాగతం పలికిన చలపతి కుటుంబ సభ్యులు.
* కుటుంబ సభ్యుల క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్న నారా భువనేశ్వరి.
* నారా భువనేశ్వరి కి చీర,సారే అందజేసిన చలపతి కుటుంబ సభ్యులు.
* పిబి వాడకు నారా భువనేశ్వరి రాకతో గ్రామస్తుల హర్షం.
కుప్పం,జులై 29 (గరుడ ధాత్రి న్యూస్): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయ మేనేజర్ చలపతి ఇంటికి వెళ్లారు. కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా గుడిపల్లి మండలం పిబి వాడకు చెందిన చలపతి ఇంటికి నారా భువనేశ్వరి చేరుకున్నారు. చలపతి కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా నారా భువనేశ్వరి కి ఆప్యాయంగా ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం చలపతి కుటుంబ సభ్యులను పలకరించారు. కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దాదాపు అరగంట పాటు చలపతి ఇంటిలోనే ఉండడం విశేషం. చలపతి కుటుంబ సభ్యులు నారా భువనేశ్వరికి చీర, సారే అందజేశారు. చలపతి పిల్లలు చదువు తదితర అంశాలు గురించి వాకబు చేశారు. చలపతి కొన్ని సంవత్సరాలు కాలంగా చంద్రబాబు కుటుంబానికి నమ్మకంగా ఉంటున్నారు.