గరుడధాత్రి న్యూస్ :
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నర ఎండ్లలో పేద వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తిరుపతి జిల్లా సత్యవేడు టిడిపి ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి గుర్తు చేశారు.సోమవారం చెన్నేరి గ్రామంలో టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి సోనియా,ఎంపిటిసి అభ్యర్థి కొప్పల జగత్‌తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం పర్వంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కూరపాటి శంకర్ రెడ్డి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చినట్టు చెప్పారు.ఇందులో భాగంగా సామాజిక భద్రత పించను అధికారంలోకి రాగానే ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి ప్రతి నెల ఒకటో తేదీన పంపిణీ చేస్తున్నామన్నారు.మెగా డీఎస్సీ నిర్వహించి లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగులు ఇచ్చిన ఘనత టిడిపి ప్రభుత్వానిదే అన్నారు.
అలాగే ఇతర రాష్ట్రాల్లో అమలు కాని విధంగా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులో కూడా మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నామన్నారు.దీంతోపాటు ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు అందిస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.అందువల్ల జరగనున్న ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో టిడిపి కూటమి అభ్యర్థులను ఆదరించి ఆశీర్వదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తదనంతరం కూరపాటి శంకర్ రెడ్డి,టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి సోనియా,ఎంపీటీసీ అభ్యర్థి జగన్ పలువురు టిడిపి నాయకులతో కలిసి చెన్నేరీ గ్రామంలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ అభ్యర్థులు ఓటర్లను ఓటును అభ్యర్థించారు.ఇదే తరహాలో ఎన్నికల ప్రచార నిమిత్తం కూరపాటి శంకర్ రెడ్డి రాచపాలెం గ్రామానికి చేరుకున్నప్పుడు మాజీ సర్పంచ్ రూబెన్ ఘన స్వాగతం పలికారు.
టపాసులు పేల్చి కూరపాటి శంకర్ రెడ్డిని పూలమాలతో సత్కరించారు.అనంతరం ఇంటింటికి వెళ్లి టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి సోనియాను గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు.జడ్పిటిసిగా గెలిపిస్తే మండల అభివృద్ధికి సాయి శక్తుల కృషి చేస్తానని అభ్యర్థి భరోసా ఇచ్చారు.తన తండ్రి గోవిందస్వామి చిన్నఈటిపాకం సర్పంచ్‌గా గ్రామానికి చేసిన సేవలను స్ఫూర్తిగా తీసుకొని అభివృద్ధికి పెద్దపీట వేస్తానన్నారు.
మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి అవసరమైన నిధులను జడ్పీ ద్వారా రాబడతానన్నారు.నవంబర్ 5వ తేదీన జరగనున్న జడ్పిటిసి,ఎంపిటిసి ఎన్నికల్లో అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై ముద్రించి గెలిపించాలని అభ్యర్థులు ఓటరు దేవుళ్ళకు విజ్ఞప్తి చేశారు.ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అంటూ ప్రాధేయపడ్డారు.
టిడిపి ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి రాకతో ఎన్నికల ప్రచారం వేడెక్కి టిడిపి అభ్యర్థులలో జోష్ పెరిగింది.ప్రస్తుతం మండలంలో పోటీ చేస్తున్న అన్ని ఎంపిటిసి స్థానాల్లో కూడా టిడిపి అభ్యర్థులు విజయం సాధించడం తద్యమని ఈ సందర్భంగా శంకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.ఈ ప్రచార కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు శివ కుమార్ నాయుడు,చంద్రశేఖర్ రెడ్డి,మాజీ మండలాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి,సుందర్ రామిరెడ్డి,కూరపాటి మురళి రెడ్డి, లోకయ్య రెడ్డి,మోహన్ రెడ్డి,రవి రెడ్డి,విఆర్ మోహన్,ఏఎం పురం ప్రభాకర్ రెడ్డి, ధనశేఖర్,షణ్ముగం పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.