టిల్‌ హెల్త్‌కేర్‌ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలి – సిఐటియు

మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి సీఐటీయూ ఆధ్వర్యంలో పరిశ్రమ ఎదుట ధర్నా సత్యవేడు అక్టోబర్ 03 గరుడధాత్రి : శ్రీ సిటీ పరిధిలోని టిల్‌ హెల్త్‌కేర్‌ పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్‌ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలని, క్షతగాత్రులకు రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ప్రమాదాన్ని నిరసిస్తూ సీఐటీయూ తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో...