GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 7:47 pm Digital Edition : GURU SWAMY

టి.ఎన్. కుప్పంలో పరిసరాల శుభ్రత పై కళాజాత కార్యక్రమం ద్వారా గ్రామస్థులకు అవగాహన

బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు4

బైరెడ్డిపల్లి మండలం లోని కడపనత్తం గ్రామ పంచాయితీ టి.ఎన్. కుప్పంలో మంగళవారం పంచాయితీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో కళాజాత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసరాలు శుభ్రత,సంక్షేమ పథకాలపై గ్రామస్థులకు కళాకారులు అవగాహన కల్పించారు. ప్రజలు తమ గృహల్లోని చెత్తను కాళీ జాగల్లో వేయవద్దని,తడి చెత్త,పొడిచెత్త విడిగా బ్యాగుల్లో ఉంచి గ్రామపంచాయతీ చెత్త తరలించే వారికి అందచేసి పరిసరాలు శుబ్రతకు దోహధపడాలని కళాకారులు పిలుపునిచ్చారు.కుతమైనాయకులు ప్రజల కు సూపర్ సిక్స్ పథకాలను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు అని వారు గ్రామస్థులకు గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ టి.డి.పి కన్వీనర్ దామోదర్ నాయుడు,కార్యకర్తలు, గ్రామస్థులు,గ్రామ పంచాయితీ కార్యదర్శి రూపా దేవి తదితరులు పాల్గొన్నారు.