టీటీడీ ఉద్యోగుల హౌస్ సైట్ల సమస్యకు పరిష్కారం దిశగా కీలక అడుగు
ఉద్యోగుల సంక్షేమానికి ముఖ్యమంత్రి సానుకూల నిర్ణయం మీడియాతో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు టీటీడీ ఉద్యోగుల హౌస్ సైట్లకు సంబంధించి కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు పరిష్కారం లభించే దిశగా కీలక అడుగు పడిందని టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ అంశంపై ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించి, వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించడం ఎంతో సంతోషకరమని ఆయన అన్నారు. మంగళవారం తిరుమలలోని తన క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఉద్యోగుల హౌస్ సైట్ల...